ఆరవ తరగతి నుండి పీజీ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ లు SBIF Asha Scholarship 2024 Hurry Up! Apply here.

Spread the love

6వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 01, 2024 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.

విద్యార్థులకు శుభవార్త!

చదువుకోవాలనే ఆసక్తి కలిగి ఆర్థికపరంగా ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులకు ఎస్బిఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్షిప్ స్కీమ్-2024 ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. 6వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 01, 2024 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం 3లక్షల రూపాయలకు మించకూడదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, వైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 6వ తరగతి నుండి పీజీ/ తత్సమాన మార్కులు మెమో, అడ్మిషన్ లెటర్, ఐడి కార్డ్, అడ్మిషన్ ఫీజురిషీట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

అర్హత ప్రమాణాలు:

  1. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో(2024-25) 6వ తరగతి నుండి పీజీ విద్యను అభ్యసిస్తూ.. గతేడాది చదివిన తరగతి లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  2. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి 3 లక్షలకు మించదు.

ఎంపిక విధానం :

  • విద్యార్థులు అకాడమిక్ తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఈ స్కాలర్షిప్ కోసం ఎంపికలు నిర్వహిస్తారు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

తరగతుల వారీగా స్కాలర్షిప్ వివరాలు :

  1. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.15 వేలు,
  2. అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.50 వేలు,
  3. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.70 వేలు,
  4. ఐఐటి చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.2,00,000/- స్కాలర్షిప్,
  5. ఐఐఎం(ఎంబిఏ/ పిజిడిఎం) చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.7,50,000/- స్కాలర్షిప్ గా అందజేయడం జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.sbifashascholarship.org/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.10.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love