ఇంటర్ పాస్ అమ్మాయి లకు రూ.24,000/- స్కాలర్షిప్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోండి Santoor Scholarship for Women’s Hurry Up! Apply here..

Spread the love

సంతూర్ స్కాలర్షిప్ పథకం 2024-25:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని యువతులకు శుభవార్త!

ఉన్నత చదువుల్లో రాణించాలనే తపన ఉండి ఎందరో ప్రతిభావంతులైన అమ్మాయిలు పేదరికం కారణంగా కొనసాగించలేకపోతున్నారు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎక్కువగా ఉన్నది. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకొని ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ సంతోష్ స్కాలర్షిప్ అందిస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన బాలికలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి..

ఇంటర్ పాస్ ల కోసం కోసం సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాం విప్రో కేర్ మరియు విప్రో కన్జ్యూమర్ కేర్ & లైటింగ్ గ్రూప్ 2024-25 విద్యా సంవత్సరానికి 12వ తరగతి పూర్తి చేసుకుని తదుపరి విద్యా అవకాశాల కోసం ప్రవేశం పొందిన యువతులకు ప్రతినెల రూ .2000/- చొప్పున సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ గా అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కార్యక్రమం 2016-17 నుండి ప్రారంభించబడింది.
గత 8 సంవత్సరాలలో 8000 మంది విద్యార్థినిలకు ఆర్థిక సహాయం అందించింది.
ఈ పథకం క్రింద అర్హులైన యువతులకు తమ డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ రూపంలో అందిస్తుంది.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

అర్హత ప్రమాణాలు/ విద్యార్హత :

  1. ప్రభుత్వ పాఠశాల నందు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  2. అలాగే 12వ తరగతి కూడా ప్రభుత్వ పాఠశాల/ జూనియర్ కళాశాల నందు విద్యా సంవత్సరం 2023-24 లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  3. విద్యా సంవత్సరం 2024-25 కు గాను డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి ప్రవేశం పొంది ఉండాలి.
  4. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి ఆర్థికంగా వెనుకబడి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తి కలిగిన యువతులకు మాత్రమే వర్తిస్తుంది.
📌 ఈ పథకం క్రింద సంవత్సరానికి 1500 మంది యువతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు.
  1. గ్రాడ్యుయేషన్ కోర్స్ వ్యవధి తప్పనిసరిగా 3 సంవత్సరాలు ఉండాలి.
  2. వృత్తి విద్య కోర్సులతోపాటు హిమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ మరియు సైన్స్ రంగాలలో ఉత్తమ విద్య నభ్యసించడానికి ప్రవేశం పొంది ఉన్న విద్యార్థినిలు తప్పనిసరిగా ఈ స్కాలర్షిప్ పథకం కోసం దరఖాస్తు చేయండి.
  3. ఈ స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన విద్యార్థినిలకు సంవత్సరానికి రూ.24,000/- కోర్సు పూర్తి అయ్యేంతవరకు చెల్లిస్తారు.
  4. ఈ మొత్తాన్ని అభ్యర్థి ట్యూషన్ ఫీజు లేదా విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులకోసం ఉపయోగించుకోవచ్చు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఎంపిక విధానం :

  • విద్యార్థులు అకాడమిక్ తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఈ స్కాలర్షిప్ కోసం ఎంపికలు నిర్వహిస్తారు.
  1. దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలి.
  2. దరఖాస్తుదారు తప్పనిసరిగా..
  3. బ్యాంక్ పాస్ బుక్ ఫోటో కాపీ,
  4. ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ,
  5. ఆధార్ కార్డు ఫోటో కాపీ,
  6. పదో తరగతి & 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కాపీలు అప్లోడ్ చేయాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.santoorscholarships.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 20.09.2024.

ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

  • విప్రో కేర్ – సంతూర్ స్కాలర్షిప్, దొడ్డకన్నేల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు – 560035 కర్ణాటక.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love