పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రక్షణ శాఖ నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. ఈ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు జూలై 28, 2024 నుండి ఆగస్టు 26, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు సమాచారం మీకోసం ఇక్కడ..
పోస్టల్ వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 143.
పోస్టుల వారీగా ఖాళీలు :
కానిస్టేబుల్ (బార్బర్) – 05,
కానిస్టేబుల్ (సఫారీ కర్మచారి) – 101,
కానిస్టేబుల్ (గార్డినర్) – 37.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి/ మెట్రిక్యులేషన్ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఒక సంవత్సరం కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ అవసరం.
అలాగే అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత విభాగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
📌 అలాగే అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి
వయోపరిమితి :
26.08.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాల మించకుండా ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.