రైల్వే లో భారీగా ఉద్యోగాల భర్తీ:
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన RITES లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష, అనుభవం & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను తేదీ 12.11.2025 లోగా సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్ PDF ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ RITES ఉద్యోగస్థితి కాంట్రాక్ట్ మొత్తం పోస్టుల సంఖ్య 600 వేతన వివరాలు బేసిక్ పే 16,338/-ప్రకారం సం.3,56,819/- అర్హతలు జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్ (డిగ్రీ/ డిప్లోమా) వయసు 18 – 40 సంవత్సరాలు దరఖాస్తు ప్రారంభం తేదీ 14.10.225 దరఖాస్తు చివరి తేదీ 12.11.2025 అధికారిక వెబ్సైట్ https://www.rites.com/
అర్హత ప్రమాణాలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగంలో డిగ్రీ/డిప్లోమా అర్హత కలిగి ఉండాలి.
పోస్ట్ సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయో పరిమితి:
తేదీ 12.11.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
ఎంపికలు:
రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
125 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా సమయం 02:50 గంటలు.
నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
దివ్యాంగులకు 50 నిమిషాలు సమయం ఎక్కువగా ఇస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
దేశవ్యాప్తంగా రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను రాతపక్ష సెంటర్ గా ఎంపిక చేసుకోవచ్చు.
వేతన వివరాలు:
పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు బేసిక్ పే రూ.16,338/- ప్రకారం సంవత్సరానికి రూ.3,56,819/- వరకు అందుకుంటారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను On-Line ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
Gen OBC లకు రూ.300/-
EWS SC ST PWD లకు రూ.100/-
📌 అధికారిక నోటిఫికేషన్ PDF కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 👨💻 ఇప్పుడే On-line దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
VIDEO
VIDEO