సైనిక్ స్కూల్ ప్రవేశాలు 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకోండి.
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026. 6వ తరగతి మరియు 9వ తరగతిలో విద్యా సంవత్సరం 2026-27 ప్రవేశాల కోసం ప్రకటన జారీ చేయబడింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. రాత పరీక్షల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ప్రవేశ ప్రకటన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. నోటిఫికేషన్, On Line దరఖాస్తు లింక్, అర్హత ప్రమాణాలు, పరీక్ష అంశాలు మొదలగునవి ఇక్కడ.
విద్యార్థిని విద్యార్థులు AISSEE-2026 VI ప్రవేశాల కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 లో ప్రభుత్వ/ ప్రైవేటు/ ఎయిడెడ్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
విద్యార్థిని విద్యార్థులు AISSEE-2026 IX ప్రవేశాల కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 లో ప్రభుత్వ/ ప్రైవేటు/ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం 10.10.2025 నుండి,
దరఖాస్తు ముగింపు 30.10.2025 నుండి 09.11.2025 సాయంత్రం 05:00 వరకు పొడిగించారు.
ఫీజు చెల్లించడానికి గడువు 31.10.2025 నుండి 10.11.2025 సాయంత్రం 05:00 వరకు పొడిగించారు..