90 రోజుల నాన్ రెసిడెన్షియల్ ఉచిత స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోండి..
తెలంగాణ ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ పత్రిక ప్రకటన: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీసీ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణలు ఇవ్వడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేయనుంది.
స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ క్రింది అంశాల్లో శిక్షణలు అందిస్తారు. అవి;
రిఫ్రిజిరేటర్,
వాషింగ్ మిషన్,
డిష్ వాషర్,
ఎయిర్ కండిషనర్,
ఇన్స్టిలేషన్ మరియు గ్యాస్ చార్జింగ్,
ఎల్ టి వి,
ఓ.ఎల్.టి.డి మానిటర్,
మైక్రోవేవ్ ఓవెన్,
వాటర్ ప్యూరిఫైయర్, మరియు
హెచ్.ఏ రిపైర్ మరియు ఇన్స్టిలేషన్ మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి/ ఇంటర్మీడియట్ అర్హతలు కలిగి ఉండాలి.
అలాగే తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ .5,00,000/- మించకుండా ఉండాలి.