డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన గ్రూప్ C సివిలియన్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ జారీ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లోయర్ డివిజన్ క్లర్క్/ టైపిస్ట్/ సివిలియన్ మెకానికల్ విభాగాల్లోని ఖాళీగా ఉన్న మొత్తం 182 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. భారతీయ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది!. ఆసక్తి కలిగిన దేశంలోని నిరుద్యోగ యువత (మహిళా/ పురుష అభ్యర్థులు) ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 02, 2024 నాటికి సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు, సిలబస్ మొదలగు సమాచారం మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 182.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుండి పోస్టులను అనుసరించి పదోతరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఫ్రెషర్స్ & అనుభవజ్ఞులు దరఖాస్తు చేసుకోండి.
వయ పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల వారికి భారత ప్రభుత్వం నిబంధన ప్రకారం వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి డిపార్ట్మెంటల్ ఎంప్లాయిస్ కు 45 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితి సూచించారు.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ఫిజికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి. అవి;
- జనరల్ ఇంటెలిజెన్స్,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్,
- న్యూమరికల్ ఎబిలిటీ,
- జనరల్ అవేర్నెస్.. మొదలగునవి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.