పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ మాస్టర్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
బంపర్ ఉద్యోగ అవకాశాలతో ఉన్న ఈ నోటిఫికేషన్ 03.12.2024 న జారీ అయినది.
ఆన్లైన్ దరఖాస్తు గడువు 25.12.2024 (అర్ధరాత్రి) వరకు.
అధికారిక నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మొదలగునవి మీ కోసం ఇక్కడ.
న్యూఢిల్లీలోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, కోర్టు మాస్టర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2024:
విద్యార్హత :
కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) – 31 పోస్టులకు;
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా డిగ్రీ,
నిమిషానికి 120 పదాలు స్పీడ్ తో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నైపుణ్యం,
కంప్యూటర్ పై టైప్ చేయగల సామర్థ్యం,
సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 33 పోస్టులకు;
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ,
నిమిషానికి 110 పదాలు స్పీడ్ తో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నైపుణ్యం,
కంప్యూటర్ పై టైప్ చేయగల సామర్థ్యం,
పర్సనల్ అసిస్టెంట్ – 43 పోస్టులకు;
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ,
నిమిషానికి 110 పదాలు స్పీడ్ తో (షార్ట్ హ్యాండ్) ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నైపుణ్యం,
కంప్యూటర్ పై టైప్ చేయగల సామర్థ్యం,
వయోపరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు Level -11, 8 & 7 ప్రకారం రూ .67,700/- నుండి రూ.44,900/- వరకు గల వేతన శ్రేణి తో కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లను కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/మాజీ సైనికులు మరియు డిపార్ట్మెంట్ అభ్యర్థులకు దరఖాస్తు రూ.250/-,
మిగిలిన వారికి రూ.1,000/- .
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.12.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.12.2024 11:55 PM వరకు.
VIDEO