Kotak Kanya Scholarship 2024-25, Hurry Up Apply Online here..

Spread the love

ఇంటర్ పాస్ అయిన వారికి సం. రూ.లక్షన్నర స్కాలర్షిప్.

  • ఇంటర్ తర్వాత పై చదువుల కోసం కోటక్ కన్యా స్కాలర్షిప్ సంవత్సరానికి రూ.1,50,000/- పొందడానికి దరఖాస్తు చేసుకోండి.
  • భారతదేశంలోని బాలిక విద్యార్థులకు కోట ఎడ్యుకేషన్ ఫౌండేషన్ శుభవార్త!
  • కోటక్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలు, మరియు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ల సహకారంతో కోటక్ కన్యా స్కాలర్షిప్ ప్రోగ్రాం 2024-25. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన బాలికలు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కోటక్ మహీంద్రా గ్రూప్ ఈ స్కాలర్షిప్ ను అందిస్తోంది.

అర్హత ప్రమాణాలు:

  • 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో CGPA స్కోర్ అర్హత కలిగి ఉండాలి.
  • ఈ స్కీమ్ భారతదేశ అంతటి బాలిక విద్యార్థులకు వర్తిస్తుంది.
  • అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.6,00,000/- మించకుండా ఉండాలి.
  • విద్యా సంవత్సరం 2024లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్/ మెడిసిన్/ MBBS/ BDS ఇంటిగ్రేటెడ్ LLB/ ఆర్కిటెక్చర్/ డిజైనింగ్/ B.Sc నర్సింగ్/ బి.ఫార్మసీ) 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ లలో అడ్మిషన్ పొంది ఉండాలి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

ప్రయోజనాలు:

  • ఎంపికైన వారికి పై చదువుల నిమిత్తం సంవత్సరానికి రూ.1,50,000/- కోర్సు పూర్తి అయ్యేంతవరకు అందిస్తారు.
  • ఈ ఆర్థిక మొత్తాన్ని ట్యూషన్ ఫీ/ హాస్టల్ ఫీ/ ఇంటర్నెట్/ రవాణా సౌకర్యం/ ల్యాప్టాప్/ బుక్స్/ మరియు స్టేషనరీలకు ఖర్చు చేసుకోవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తులో భాగంగా ఈ క్రింది డాక్యుమెంట్స్ లను ఆన్లైన్లో సమర్పించాలి.
  1. 12వ తరగతి మార్క్ మెమో,
  2. ఆదాయ ధ్రువీకరణ పత్రం,
  3. 2023-24 విద్యా సంవత్సరం యొక్క ఫీ-స్ట్రక్చర్,
  4. బోనఫైడ్/ స్టడీ సర్టిఫికెట్/ కాలేజ్ లెటర్,
  5. సీట్ అలాట్మెంట్ డాక్యుమెంట్,
  6. ఆధార్ కార్డ్,
  7. బ్యాంక్ పాస్ బుక్,
  8. ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్,
  9. PWD అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్,
  10. పుట్టిన తేదీ సర్టిఫికెట్.. మొదలగునవి, సమర్పించాల్సి ఉంటుంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. (లేదా)..
  2. ఇక్కడ ఇవ్వబడిన Apply online లింక్ పై క్లిక్ చేయండి.
  3. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://kotakeducation.org/
  4. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను సమర్పించి దరఖాస్తును సమర్పణ విజయవంతం చేయండి.
  5. భవిష్యత్ కార్యాచరణ కోసం దరఖాస్తు ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 30.09.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love