ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి Cradit Access Grameen శుభవార్త!
భారతదేశపు అతిపెద్ద NBFC-MFI లో భారీగా ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 2024 ఆదివారం నాడు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ నోటిఫికేషన్ పోస్టర్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలంగాణలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు..
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్,
బ్రాంచ్ మేనేజర్,
సీనియర్ బ్రాంచ్ మేనేజర్.
అర్హత ప్రమాణాలు:
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టుల కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ మరియు ఆపై అర్హతలు కలిగి ఉండాలి.