నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తుంది.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
ఈ సంవత్సరం 2000 విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడానికి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇందులో..
- ఎస్సీ, ఎస్టీలకు 1000,
- ఓబీసీలకు 500,
- జనరల్ అభ్యర్థులకు 500,
- అన్ని విభాగాల్లో 50% మహిళలకు అందిస్తుంది.
కాబట్టి ఆసక్తి కలిగిన యూజీ & పిజి విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం అందుకోవడానికి.. ఈ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోండి.
అర్హత ప్రమాణాలు :
- ఇంటర్లో కనీసం 60 శాతం మార్పులతో అర్హత సాధించి ఉండాలి.
- తల్లితండ్రుల వార్షికదాయం 2 లక్షలకు మించకూడదు.
- ఎస్సీ, ఎస్టీలైతే 4.5 లక్షల వరకు ఉండవచ్చు.
- దేశవ్యాప్తంగా చదువుతున్న ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ జనరల్ కేటగిరి (ఈడబ్ల్యూఎస్) వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదలు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నందు విద్యా సంవత్సరం 2024-25 లో రెగ్యులర్ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ (బిఈ/ బిటెక్) ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ కోర్సులలో ప్రథమ సంవత్సరం చదువుతూ ఉండాలి.
వయోపరిమితి :
- 01.08.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపిక విధానం :
- ఈ స్కాలర్షిప్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్ & డిగ్రీ స్థాయిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మంజూరు చేస్తారు.
- ఎంపికైన వారికి కోర్స్ పూర్తయ్యేంతవరకు ప్రతి నెల రూ.4000/- చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు.
నిబంధనలు :
- ఇక్కడ స్కాలర్షిప్ తీసుకోవాలంటే వేరే ఏ ఇతర స్కాలర్షిప్లకు ఎంపిక అయి ఉండరాదు.
- పైన తెలిపిన కోర్సుల్లో ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- దరఖాస్తు సమర్పణలో భాగంగా అభ్యర్థులు..
- కుల ధ్రువీకరణ పత్రం,
- పదో తరగతి మార్కుల మేమో,
- ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ అకౌంట్ పాస్బుక్,
- కాలేజ్ ఐడి,
- అడ్మిషన్ వివరాలు మొదలగు పత్రాలు అప్లోడ్ చేయాలి.