వ్యవసాయ పాడి పంటలు మాస పత్రిక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ. రైతాంగానికి సలహాలు, సూచనలు అందిస్తూ, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, మరియు రాయితీలను గురించి సమాచారాన్ని తెలియజేస్తున్న కరదీపిక “వ్యవసాయ పాడిపంటలు” పత్రికను చదువుదాం. రైతులందరిచేత చదివిద్దాం!

| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రైతులకు పాడి పంటల విషయంలో సలహాలు, సూచనలు అందించడానికి, అలాగే వ్యవసాయ రంగంలో తాజాగా వస్తున్న సాంకేతిక మార్పులు, అభివృద్ధి మరియు ప్రభుత్వ పథకాలు, రాయితీలను ఎప్పటికప్పుడు తెలియపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం పాడిపంటలు మాసపత్రికను రైతులకు అందిస్తోంది. రైతులు ఈ మాస పత్రికను చదవడం ద్వారా వానాకాలం, చలికాలం & ఎండాకాలంలో ఎలాంటి పంటలు పండించాలి ఏ పంటలకు ఆయా కాలంలో దిగుబడి అధికంగా లభిస్తుంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. సీజనల్ పంటలు పండించడం ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. వాతావరణం, పంటల పరిస్థితి, తెగుళ్ల నివారణ మరియు చేపట్టాల్సిన రక్షణ చర్యలపే సలహాలు అందుకోవచ్చు.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
పంటలను మేలైన యాజమాన్య పద్ధతుల్లో పండించడం ద్వారా నష్టాల బారిన పడకుండా దిగుబడి సాధించవచ్చు. చీడపీడల నివారణ సమగ్ర యాజమాన్య పద్ధతులు సాగుకు అవసరమైన సూచనలు, సలహాలు ఈ పత్రిక ద్వారా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులు, రైతులకు కావలసిన సమాచారాన్ని అందిస్తున్నారు.