సంతూర్ స్కాలర్షిప్ పథకం 2024-25:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని యువతులకు శుభవార్త!
ఉన్నత చదువుల్లో రాణించాలనే తపన ఉండి ఎందరో ప్రతిభావంతులైన అమ్మాయిలు పేదరికం కారణంగా కొనసాగించలేకపోతున్నారు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎక్కువగా ఉన్నది. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకొని ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ సంతోష్ స్కాలర్షిప్ అందిస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన బాలికలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి..
ఇంటర్ పాస్ ల కోసం కోసం సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాం విప్రో కేర్ మరియు విప్రో కన్జ్యూమర్ కేర్ & లైటింగ్ గ్రూప్ 2024-25 విద్యా సంవత్సరానికి 12వ తరగతి పూర్తి చేసుకుని తదుపరి విద్యా అవకాశాల కోసం ప్రవేశం పొందిన యువతులకు ప్రతినెల రూ .2000/- చొప్పున సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ గా అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కార్యక్రమం 2016-17 నుండి ప్రారంభించబడింది.
గత 8 సంవత్సరాలలో 8000 మంది విద్యార్థినిలకు ఆర్థిక సహాయం అందించింది.
ఈ పథకం క్రింద అర్హులైన యువతులకు తమ డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ రూపంలో అందిస్తుంది.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
అర్హత ప్రమాణాలు/ విద్యార్హత :
- ప్రభుత్వ పాఠశాల నందు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అలాగే 12వ తరగతి కూడా ప్రభుత్వ పాఠశాల/ జూనియర్ కళాశాల నందు విద్యా సంవత్సరం 2023-24 లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- విద్యా సంవత్సరం 2024-25 కు గాను డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి ప్రవేశం పొంది ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి ఆర్థికంగా వెనుకబడి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తి కలిగిన యువతులకు మాత్రమే వర్తిస్తుంది.
📌 ఈ పథకం క్రింద సంవత్సరానికి 1500 మంది యువతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు.
- గ్రాడ్యుయేషన్ కోర్స్ వ్యవధి తప్పనిసరిగా 3 సంవత్సరాలు ఉండాలి.
- వృత్తి విద్య కోర్సులతోపాటు హిమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ మరియు సైన్స్ రంగాలలో ఉత్తమ విద్య నభ్యసించడానికి ప్రవేశం పొంది ఉన్న విద్యార్థినిలు తప్పనిసరిగా ఈ స్కాలర్షిప్ పథకం కోసం దరఖాస్తు చేయండి.
- ఈ స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన విద్యార్థినిలకు సంవత్సరానికి రూ.24,000/- కోర్సు పూర్తి అయ్యేంతవరకు చెల్లిస్తారు.
- ఈ మొత్తాన్ని అభ్యర్థి ట్యూషన్ ఫీజు లేదా విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులకోసం ఉపయోగించుకోవచ్చు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపిక విధానం :
- విద్యార్థులు అకాడమిక్ తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఈ స్కాలర్షిప్ కోసం ఎంపికలు నిర్వహిస్తారు.
- దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలి.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా..
- బ్యాంక్ పాస్ బుక్ ఫోటో కాపీ,
- ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ,
- ఆధార్ కార్డు ఫోటో కాపీ,
- పదో తరగతి & 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కాపీలు అప్లోడ్ చేయాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.santoorscholarships.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 20.09.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- విప్రో కేర్ – సంతూర్ స్కాలర్షిప్, దొడ్డకన్నేల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు – 560035 కర్ణాటక.