నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి On-Line విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No.CC/05/2025 తేదీ: 15.10.2025 న జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 05, 2025. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికిల్ చదవండి.

| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | POWERGRID |
| ఉద్యోగస్థితి | రెగ్యులర్ ఉద్యోగాలు |
| మొత్తం పోస్టుల సంఖ్య | 20 |
| వేతన వివరాలు | రూ.40,000 – రూ.1,60,000 |
| అర్హతలు | ఇంటర్మీడియట్, అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి |
| వయసు | 18 – 28 సంవత్సరాలు |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 29.09.225 |
| దరఖాస్తు చివరి తేదీ | 05.11.2025 |
| అధికారిక వెబ్సైట్ | https://www.powergrid.in/ |
పోస్టుల వివరాలు:
- ఆఫీసర్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ)
- ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్)
అర్హత ప్రమాణాలు:
- ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల కోసం: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ (CA/ ICWA/ CMA) అర్హత కలిగి ఉండాలి.
- ఆఫీస్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ) పోస్టుల కోసం: అసోసియేట్ మెంబర్ గా అర్హత కలిగి ఉండాలి
వయో పరిమితి:
- తేదీ 05.11.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయో పరిమితి 43 సంవత్సరాల వరకు అవకాశం ఉంది.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపికలు:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
- పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను On-Line ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- SC/ ST/ PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.500/-.
ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది దశలను ఫాలో అవ్వండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.powergrid.in/
- అధికారిక హోమ్ పేజీలోని Careers లింక్ పై క్లిక్ చేసి, JOB OPPORTUNITIES క్రింద కనిపిస్తున్న Openings లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ వివరాలు కలిగినటువంటి పేజీలో రీ డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ కనిపిస్తున్న వివరాల ఆధారంగా Click here to register/login and apply లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రకటన ముఖ్య లింకులు.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
On-Line లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక JOB OPPORTUNITIES పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.