జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, టెన్త్ పాస్ సర్టిఫికెట్ చాలు. వివరాలు AVNL Junior Technician Notification 2025 Hurry Up!

Spread the love

టెన్త్ పాస్ అభ్యర్థులకు శుభవార్త:

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ (AVNL) అవాడి, చెన్నై. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి పదో తరగతితో సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల నుండి Off-Line విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.HVF/RG/FTB/RECT/JTC/2025/26 విడుదలైనది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 01, 2025. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
పోస్టుల వివరాలు:
  • మొత్తం పోస్టుల సంఖ్య : 98.
కోర్సుల వారీగా పోస్టులు :
  1. జూనియర్ టెక్నీషియన్ (ఆపరేటర్ మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్) – 55,
  2. జూనియర్ టెక్నీషియన్ (రిగ్గర్) – 25,
  3. జూనియర్ టెక్నీషియన్ (హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్) – 08,
  4. జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్) – 04,
  5. జూనియర్ టెక్నీషియన్ (సాండ్ షార్ట్ బ్లాస్టర్) – 06
విద్యార్హత:
  1. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి తత్సమాన అర్హతతో సంబంధిత విభాగంలో అనుభవం పూర్తి చేసి ఉండాలి.
  2. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
వయో పరిమితి:
  1. తేదీ 03.11.2025 నాటికి దరఖాస్తుదారులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
  2. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
  • దరఖాస్తులను Off-Line Ordinary Post ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా:
  • The Chief General Manager, Heavy Vehicles Factory, Avadi, Chennai – 600 054
దరఖాస్తు ఫీజు :
  1. SC/ ST/ PWBD/ Ex-SM & Female అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
  2. మిగిలిన వారు రూ.300/-
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

నోటిఫికేషన్ ముఖ్య తేదీలు & ఇతర సమాచారం:

  1. దరఖాస్తు ప్రక్రియ 10.10.2025 నుండి ప్రారంభమైనది.
  2. దరఖాస్తు చివరి తేదీ : 01.11.2025.
  3. కాంట్రాక్ట్ కాలం : 12నెలలు (ఒక సంవత్సరం).
ఎంపికలు:
  • అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ట్రేడ్ పరీక్ష నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
  • ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.21,000/- ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ అన్నీ అలవెన్స్ కలిపి దాదాపుగా రూ.40,000/- ప్రతి నెల చెల్లిస్తారు.

నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక వెబ్సైట్ :: https://ddpdoo.gov.in/


Spread the love