నిరుద్యోగులకు శుభవార్త!
రిజిస్ట్రేషన్ లింకు ఈ ఆర్టికిల్ చివరన ఉన్నది. రిజిస్టర్ అవ్వడం ద్వారా MEGA JOB MELA ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.



| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
మెగా జాబ్ మేళా
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మందమర్రి ఏరియా వారి ఆధ్వర్యంలో.. 75 పైగా మల్టీ నేషనల్ కంపెనీలు, 4000 ఉద్యోగ అవకాశాలు అందించడానికి తేదీ: 26.10.2025 న “మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్. బలరాం, IRS గారు ప్రకటన జారీ చేశారు.
గౌరవ బెల్లంపల్లి శ్రీ గడ్డం వినోద్ వెంకట్ స్వామి, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం, IRS. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ మరియు నోబుల్ ఎంపవర్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 26, 2025న ఉదయం 08:00 గంటల నుండి బెల్లంపల్లి, ఏఎంసీ క్రీడా మైదానంలో మెగా జాబ్ మేళా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 70 ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు 4000 ఉద్యోగ అవకాశాలు అందించడానికి భాగస్వాములు అవుతున్నారు. ఈ జాబ్ మేళాకు మందమర్రి బెల్లంపల్లి మరియు పరిసర ప్రాంతాల నుండి సుమారు 7000 మంది నిరుద్యోగ యువత హాజరుకానునట్లు నిర్వాహకులు ముందస్తుగా సమాచారం తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి.
మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఐటి, నాన్-ఐటి, డిజిటల్, మార్కెటింగ్ మరియు సర్వీసెస్ సెంటర్ మొదలగు రంగాలకు చెందిన సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, అదే రోజు సాధ్యమైనంత వరకు నియామక పత్రాలు ఉద్యోగార్థులకు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు నిరుద్యోగ యువత అధిక మొత్తంలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సూచనలు చేశారు. అలాగే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ గానే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట్ స్వామి గారి సహకారంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది.
7వ తరగతి నుండి పీజీ అర్హత కలిగి 18 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళ/ పురుష అభ్యర్థులు అందరూ ఈ జాబ్ మేళాలో భాగస్వాములు కావచ్చు.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.