Free JOB Oriented Training 2025: స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ – సంస్థ ఖమ్మం జిల్లా, నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.

Spread the love

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాది అవకాశాలు:

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచితంగా శిక్షణలు అందిస్తోంది. తాజాగా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ – ఖమ్మం జిల్లా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు, ఈ క్రింద పేర్కొన్న విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచితంగా యూనిఫాం, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. సీసీటీవీ ఇన్స్టలేషన్ మరియు సర్వీసింగ్ అనే అంశంపై 13 రోజులు శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. కనీసం 7వ తరగతి చదివిన అభ్యర్థులు, మరియు ఆసక్తి కొద్దీ ఆపై అర్హతలు కలిగి సీసీటీవీ ఇన్స్టలేషన్ మరియు సర్వీసింగ్ పై శిక్షణ తీసుకొని అభ్యర్థులు కూడా ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని SBI Rural Self Employment Training Institute నందు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
  • వివరాలకు 08742-295 సంప్రదించండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ RSETI ఇప్పటికే ఎన్నో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తమ బ్యాంకు ద్వారా రుణాలను సైతం అందించే స్వయం ఉపాధికి తోడ్పాటు నిస్తోంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఇలాంటి శిక్షణ ఉచితంగా తీసుకొని నిరుద్యోగాన్ని జయించాలని సంస్థ ఆశిస్తోంది.


Spread the love