ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
మస్పిటాలిటీ మోనిటర్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్..
భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని, “నవరత్న” లిస్టెడ్ కంపెనీ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వేల యొక్క వృత్తిపరమైన ఆతిధ్య మరియు ప్రయాణ విభాగం, రైల్వేలో హాస్పిటల్ మానిటర్స్ సేవలను అభివృద్ధి చేయడానికి అలాగే దేశంలో రైలు ఆధారిత దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడినది. తాజాగా ఐ ఆర్ సి టి సి సౌత్ సెంట్రల్ జోన్ నుండి హాస్పిటాలిటీ మానిటర్స్ విభాగంలో మొత్తం 22 పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయబడినది. ఒక (1) సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఈ నియామకాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ No. 2026/IRCTC/HRD/SCZ/Rectt.-I/Hospitality Monitors (Fixed Term Contract) తేదీ: 16.09.2026 న విడుదల అయినది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు ఫామ్, ఇంటర్వ్యూ షెడ్యూల్, ముఖ్య తేదీలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? మొదలగు పూర్తి ముఖ్య సమాచారం కోసం ఈ ఆర్టికల్లో…


ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | IRCTC SCZ |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టులు | 22 |
| విద్యార్హతలు | Bachelor Degree in Hospitality and Hotal Administration |
| వేతనం | రూ.30,000/- |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 16.09.2026 |
| ఇంటర్వ్యూ తేదీ | 05 & 08.10.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://www.irctc.com/index.php & https://www.irctc.com/new-openings.php |
పోస్టుల వివరాలు:
- హాస్పిటాలిటీ మానిటర్స్ – 22.
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి B.Sc విభాగంలో హాస్పిటల్ కి మరియు హోటల్ అడ్మినిస్ట్రేషన్/ హోటల్ మేనేజ్మెంట్/ BBA/ MBA బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధి విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం సర్టిఫికేట్ ఉంటే జిరాక్స్ కాపీ అప్లికేషన్ ఫామ్ కు జత చేయండి..
- ఇంటర్వ్యూ సమయంలో చూపించండి.
వయోపరిమితి వివరాలు:
- తేదీ 01.09.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంది.
- వయోపరిమితులో సడలింపులు కావాలనుకునే అభ్యర్థులు, నోటిఫికేషన్ చదవండి.
ఎంపికలు:
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ షెడ్యూల్ తెలుసుకొని ఆ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- IRCTC సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.30,000/- వేల వరకు చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 05 & 08 అక్టోబర్ 2026 ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
దరఖాస్తు ఫీజు:
- ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు లేదు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ (వేదిక, తేదీ & సమయం) షెడ్యూల్ :

ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:
- అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ కు రావాలి.
- ఒరిజినల్ సర్టిఫికెట్ లేని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు అనుమతించరు.
- 10వ తరగతి మార్క్ మెమో సర్టిఫికెట్,
- ఇంటర్మీడియట్ మార్క్ మెమో సర్టిఫికెట్,
- గ్రాడ్యుయేషన్ మార్క్ మెమో సర్టిఫికెట్,
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ మెమో సర్టిఫికెట్,
- అన్ని రకాల అనుభవం సర్టిఫికెట్లు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్,
- సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ,
- ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్,
- సంబంధి అన్ని రకాల సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.