ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
మోడల్ స్కూల్ లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు? ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 194 మోడల్ స్కూళ్లలో నాలుగు విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పోస్టులను అనుసరించి రూ.19,500 నుండి రూ.22,750 ప్రతి నెల వేతనం చెల్లించనుంది అయితే ఎంపికైన అభ్యర్థి నవంబర్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు లేదా అవసరం ముగిసే వరకు మాత్రమే సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ పోస్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సిబ్బంది నియమించే వరకు ఔట్సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్ లలో ఖాళీల వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.


ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | TG Model School |
| ఉద్యోగస్థితి | ఔట్సోర్సింగ్ |
| మొత్తం పోస్టులు | 776 |
| విద్యార్హతలు | Inter, Degree, Diploma తో B.Ed |
| వేతనం | రూ.19,500-22,700 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | త్వరలో.. |
| దరఖాస్తు చివరి తేదీ | అప్డేట్ చేయబడుతుంది |
| అధికారిక వెబ్సైట్ | https://telanganamodelschool.com/ |
పోస్టుల వివరాలు & పోస్టుల సంఖ్య:
- ఆర్ట్ టీచర్ – 194
- యోగా టీచర్ – 194
- కంప్యూటర్ టీచర్ – 194
- లైబ్రేరియన్ – 194
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ క్రింద తెలిపిన ప్రకారం అర్హత కలిగి ఉండాలి.
- ఆర్ట్ టీచర్ పోస్టులకు.. ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్ లేదా బ్యాచిలర్ డిగ్రీ తో పాటు పెయింటింగ్, శిల్పకళ, కమర్షియల్ ఆర్ట్, ప్రింట్ మేకింగ్/డిజైనింగ్, యానిమేట్ చేయడం వంటి విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
- యోగా టీచర్ పోస్టులకు.. గ్రాడ్యుయేషన్ తో పాటు యోగాలో డిప్లొమా లేదా డిగ్రీ యోగా స్పెషలైజేషన్, B.Ed, B.P.Ed అర్హత సర్టిఫికెట్ అవసరం.
- కంప్యూటర్ టీచర్ పోస్టులకు.. కంప్యూటర్ సైన్స్, IT, B.E, B.Tech, MCA, BCA, B.Sc కంప్యూటర్ సైన్స్ అర్హత అవసరం.
- లైబ్రేరియన్ పోస్టులకు.. లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(B.L.I.Sc/M.L.I.Sc) లో మాస్టర్ లేదా బ్యాచిలర్ డిగ్రీ అర్హత అవసరం.
- అనుభవం ఉన్న వారికే ప్రథమ ప్రాధాన్యత.
- సర్టిఫికెట్ కలిగి ఉంటే పరిగణన లోకి వస్తారు.
వయోపరిమితి వివరాలు:
- పైన తెలిపినటువంటి నాలుగు రకాల పోస్టులకు, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు – దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తిచేసుకుని 44 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
- Off-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం:
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 194 మోడల్ స్కూల్ లలో పోస్టింగ్ ఇస్తారు. జిల్లాస్థాయి విధానంలో అభ్యర్థులకు స్థానికత ఆధారంగా తమ సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- ఆర్ట్ యోగా కంప్యూటర్ టీచర్లకు రూ.22,700/-,
- లైబ్రేరియన్ లకు రూ.19,500/-
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
- 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు జతచేసి, మీ సమీపంలోని మోడల్ స్కూల్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- ఈ మోడల్ స్కూల్ లలో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించిన ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపికైన సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు:
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు యోగా, కళలు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ను అందించడం ఈ నియామకం ప్రధాన ఉద్దేశం.
- కంప్యూటర్ టీచర్లు.. తరగతుల స్థాయినిబట్టి బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్, ఇంటర్నెట్ వాడకం & భద్రత, ప్రోగ్రామింగ్, డేటా ను హ్యాండిల్ చేయడం, వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ వంటి అంశాలను విద్యార్థులకు బోధించాలి.
- లైబ్రేరియన్లు.. లైబ్రరీలోని పుస్తకాల నిర్వహణ, విద్యార్థులకు సమాచారం, వనరులు అందుబాటు, డిజిటల్ వనరుల వినియోగంపై దృష్టి, విద్యార్థులలో రీడింగ్ స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలు పై దృష్టి సారించాలి.
| TGMS Jangaon Dist Notification | Download here |
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
Yoga