DMHO BKD Walk In Interview Notification 2026 – Check Eligibility Vacancies

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

తెలంగాణ ప్రభుత్వం, జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ క్రింద వివిధ బస్తీ దావకానాల్లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల కోసం ఆసక్తి కలిగిన జిల్లా స్థానిక అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు ప్రకటనలో పేర్కొన్న తేదీ ప్రకారం తమ నకలు సర్టిఫికెట్ కాపీలు తీసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టింగ్ ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పోస్టుల ఆధారంగా రూ.10,000 నుండి రూ.42,000 జీతం చెల్లిస్తారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ చూసి, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థDMHO Bhadradri Kothagudem
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు04
విద్యార్హతలు10th, Inter, MBBS Degree
వేతనంరూ.10,000-42,000
దరఖాస్తు ప్రారంభం తేదీ09.10.2026
దరఖాస్తు చివరి తేదీ15.10.2026
అధికారిక వెబ్సైట్https://kothagudem.telangana.gov.in/
పోస్టుల వివరాలు:
  1. మెడికల్ ఆఫీసర్ – 03
  2. సపోర్టింగ్ స్టాఫ్ – 01
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th, Intermediate, MBBS Degree అర్హత కలిగి ఉండాలి.
  2. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ 15.10.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 55 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
  1. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వవచ్చు.
  3. ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే పోస్టింగ్ ఇస్తారు.
  4. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికలు జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ మరియు జిల్లా ఎంపిక కమిటీ (DSC) చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు..
  5. 📌 సూచన:: మొత్తం 100 వంద మార్కులకు (అర్హత పరీక్ష MBBS మార్కుల ఆధారంగా 90 మార్కులు + వయసు వెయిటేజీ కోసం 10 మార్కులు) ఎంపిక ఉంటుంది.
వేతన వివరాలు:
  • పై పోస్టులకు సెలెక్ట్ అయితే ఈ క్రింద సూచించిన ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. మెడికల్ ఆఫీసర్ రూ.42,000/-,
  2. సపోర్టింగ్ స్టాప్ రూ.10,000/-
అప్లికేషన్ ప్రాసెస్:
  • ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు ముందుగా సమర్పించాల్సిన అవసరం లేదు.
  • ప్రకటనలో తెలుపబడిన ఇంటర్వ్యూ తేదీ న 10:30 AM నుండి 05:00PM వరకు రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
  • 📌 సూచన :: దరఖాస్తు ఫామ్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. అక్కడినుండి డౌన్లోడ్ చేసుకొని (లేదా) ఈ పేజీ చివరన ఇవ్వబడినటువంటి లింక్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 05.10.2026 నాడు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ సిబ్బందికి సమర్పించాలి.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ వివరాలు:

  • ఇంటర్వ్యూ తేదీ: 15.10.2026
  • వేదిక: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, కార్యాలయం. భద్రాద్రి కొత్తగూడెం.
దరఖాస్తు ఫీజు:
  • బస్తీ దావఖానాల్లో మెడికల్ ఆఫీసర్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు/ ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

పత్రికా ప్రకటన Pdf :: డౌన్లోడ్ చేయండి.

అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.


Spread the love

2 thoughts on “DMHO BKD Walk In Interview Notification 2026 – Check Eligibility Vacancies”

Leave a Comment