Walk In Interview Recruitment 2026 – Check Vacancies

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, MoE ఆధీనంలోని సెంట్రల్ యూనివర్సిటీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంటాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, సెంటర్ ఫర్ డైరెక్టరేట్ మరియు ఆన్లైన్ ఎడ్యుకేషన్ (CDOE) హైదరాబాద్లోని గచ్చిబౌలి MANUU క్యాంపస్ నందు, ఇంటర్వ్యూలను ఈనెల 12 & 13 తేదీల్లో నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఈ ఇంటర్వ్యూలలో పాల్గొని సేవలు అందించవచ్చు ఎలాంటి రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం వేతనం అందిస్తారు. దాదాపుగా రూ.50,000/- ప్రతినెల అందుకోవచ్చు. 65 సంవత్సరాలకు లోబడి వయస్సు ఉన్న అందరూ కూడాను ఈ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థMANUU
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు05
విద్యార్హతలుసంబంధిత విభాగంలో MBA/ PGDBM/ PG/ PhD/ NET
వేతనంరూ.50,000/-
దరఖాస్తు ప్రారంభం తేదీ02.11.2026
దరఖాస్తు చివరి తేదీ13.11.2026
అధికారిక వెబ్సైట్https://manuu.edu.in/
పోస్టుల వివరాలు:
  1. మేనేజ్మెంట్ – 02
  2. సోషల్ వర్క్ – 01
  3. ఎడ్యుకేషన్ (B.Ed) – 02
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBA/ PGDBM/ PG/ PhD/ NET అర్హత కలిగి ఉండాలి.
  2. NET/ SLET/ SET అర్హత అవసరం.
  3. అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
  4. అనుభవం కలిగిన అభ్యర్థులు సంబంధిత జిరాక్స్ కాపీ సర్టిఫికెట్ ను ఇంటర్వ్యూ సమయంలో అందించండి..
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తిచేసుకుని 65 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
  1. ఇంటర్వ్యూ తేదీ నాడు రిపోర్టింగ్ సమయంలో అందించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. MANUU, MoE సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం:
  • మను క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్.
వేతన వివరాలు:
  • ఇంటర్వ్యూ ద్వారా నోటిఫికేషన్ లో తెలుపబడిన పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.50,000/- ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకారం సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, ఇంటర్వ్యూ తేదీనాడు రిపోర్టింగ్ సమయంలో అందించాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

🤔సందేహాలు, 😇 సమాధానాలు:

  • 🤔 సందేహం: ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టుల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
  • 😇 సమాధానం: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పీజీ పీహెచ్డీ రీసెర్చ్ పూర్తిచేసే అవకాశాల కోసం చూస్తున్న లేదా రిటైర్డ్ యూనివర్సిటీ (ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్/ అసోసిస్టెంట్ ప్రొఫెసర్) మరియు కాలేజ్ టీచర్స్) నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 🤔 సందేహం: వయో పరిమితి ఎంత?
  • 😇 సమాధానం: 65 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగిన వారు అందరూ కూడాను దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 🤔 సందేహం: వేతనం ఎంత ఉంటుంది?
  • 😇 సమాధానం: UGC గైడ్లైన్స్ ప్రకారం రూ.50,000/- చెల్లిస్తారు.
  • 🤔 సందేహం: సెలెక్ట్ అయితే ఎప్పటి వరకు కొనసాగవచ్చు?
  • 😇 సమాధానం: రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమించే వరకు, కొనసాగుతూనే ఉంటారు.
  • 🤔 సందేహం: దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
  • 😇 సమాధానం: ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. ఇంటర్వ్యూ తేదీ నాడు సంబంధిత కాపీలతో హాజరై, ఇంటర్వ్యూ తో సెలెక్ట్ కావచ్చు..

Leave a Comment