CWC Recruitment 2026 – Apply 327 Positions here

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, నవరత్న, కేంద్ర పబ్లిక్ సెక్టార్ కంపెనీ, కార్పొరేషన్ వ్యవసాయ ఉత్పాదకాలు ఉత్పత్తులు మరియు ఇతర నోటిఫైడ్ వస్తువుల కోసం శాస్త్రీయ నిల్వ సౌకర్యాలను అందించడంతోపాటు CFSలు/ IDCలు, ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లు మొదలైన లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు కలిగినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయడానికి అర్హతలు ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 327 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ రెగ్యులర్ కొలువుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థCentral Warehousing Corporation
ఉద్యోగస్థితిరెగ్యులర్
మొత్తం పోస్టులు327
విద్యార్హతలుసంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా
వేతనంరూ.29,000-1,40,000
దరఖాస్తు ప్రారంభం తేదీ17.10.2026
దరఖాస్తు చివరి తేదీ15.11.2026
అధికారిక వెబ్సైట్https://cwceportal.com/careers
పోస్టుల వివరాలు:
  1. అసిస్టెంట్ మేనేజర్ (జనరల్) – 70
  2. అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ – 60
  3. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) -10
  4. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీరింగ్) సివిల్ – 22
  5. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీరింగ్) ఎలక్ట్రికల్ – 05
  6. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీరింగ్) మెకానికల్ – 04
  7. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జనరల్) – 78
  8. జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ – 78
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో రెండేళ్ల పీజీ డిగ్రీ/ డిప్లొమా, అగ్రికల్చర్/ ఫుల్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ బయోటెక్నాలజీ/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఇంజనీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్ లో BE/ B.Tech, కామర్స్ డిగ్రీ లేదా CA/ MCA ఇంటర్మీడియట్, అగ్రికల్చర్/ బొటని/ జువాలజీ/ బయోటెక్నాలజీ/ మైక్రోబయాలజీ/ కెమిస్ట్రీ/ ఫుడ్ సైన్స్ విభాగాల్లో B.Sc అర్హత కలిగి ఉండాలి.
  2. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టుకు అనుభవం అవసరం.
  3. మిగిలిన అన్ని పోస్టులకు అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి వివరాలు:
  • తేదీ: 15.11.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 28 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • వయోపరిమితిలో క్రింద సూచించిన విధంగా సడలింపులు ఉన్నాయి.
    • SC/ ST లకు 5 సంవత్సరాలు
    • OBC (Non-Creamy Layar) లకు 3 సంవత్సరాలు
    • PwBD లకు 10 సంవత్సరాలు
    • మాజీ సైనికులకు 5 సంవత్సరాలు
ఎంపికలు:
  1. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు..
    1. ఆన్లైన్ పరీక్ష
    2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
    3. ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
  2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు..
    1. ఆన్లైన్ పరీక్ష
    2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది
రాత పరీక్ష అంశాలు :
రాత పరీక్ష కేంద్రాలు :
పోస్టింగ్ ప్రదేశాలు :
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు దిగువ పేర్కొన్న ప్రకారం ఎంపిక కాబడిన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. అసిస్టెంట్ మేనేజర్ లకు రూ.40,000/- నుండి రూ.1,40,000/-,
  2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లకు రూ.29,000/- నుండి రూ.93,000/-.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
    • ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    • విజయవంతంగా రిజిస్ట్రేషన్ ముగించుకొని లాగిన్ అయి దరఖాస్తులు సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • GEN/ OBC/ EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850/- ఇంటిమేషన్ చార్జెస్ రూ.500/-. మొత్తం రూ.1,350/-.
  • CS/ ST/ PwBD/ ESM & Women అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. ఇంటిమేషన్ చార్జెస్ కోసం రూ.500/- చెల్లించాలి.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment