రైల్వేలో 1599 ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష లేదు. ECOR Apprentice Notification

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..

భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఈస్ట్ కోస్ట్ రైల్వే చంద్రశేఖర్ పూర్, భువనేశ్వర్, ఒడిస్సా. 2026-27 సంవత్సరానికి, 1599 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ (Notification No. ECoR/Pers/RRC/ Act Apprentice/2026-27 తేదీ: 21.08.2026) విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అక్కడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రగతి ఆధారంగా.. ఎంపికలు ఉంటాయి. భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అర్హులు. అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు సమర్పించుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 26.08.2026 నుండి అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు గడువు 15.09.2026. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు, అప్లికేషన్ విధానం? ఎంపిక? మొదలగు పూర్తి సమాచారం…

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థEast Coast Railway
ఉద్యోగస్థితిఅప్రెంటిస్ శిక్షణ
మొత్తం పోస్టులు1599
విద్యార్హతలు10th/ Matriculation/ ITI (NCVT/ SCVT)
వేతనంరూ.10,000-12,500
దరఖాస్తు ప్రారంభం తేదీ26.08.2026
దరఖాస్తు చివరి తేదీ15.09.2026
అధికారిక వెబ్సైట్https://ecorbbs.in/
పోస్టుల వివరాలు:
  1. క్యారేజ్ రాయపూర్ వర్క్ షాప్, మంచిశ్వర్ – 250,
  2. RGDA డివిజన్ – 292,
  3. ఖుర్దా రోడ్ డివిజన్ – 773,
  4. సంబల్పూర్ డివిజన్ – 262,
  5. ECoR హెడ్ క్వాటర్స్, భువనేశ్వర్ – 22.
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి 10th/ Matriculation/ ITI (NCVT/ SCVT) అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 24 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • రైల్వే మంత్రిత్వ శాఖ గైడ్లైన్స్ ప్రకారం, రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారికి సడలింపు ఉంది.
  • వివరాల కోసం అప్రెంటిస్ ప్రకటన పూర్తిగా చదవండి.
ఎంపికలు:
  1. On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, అకాడమిక్, టెక్నికల్ మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. ECoR సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. రూ.12,500/-,
  2. రూ.10,000/-
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.100/-,
  • CS/ ST/ PwBD & Women అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: క్లిక్ చేయండి.

ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

  • On-Line దరఖాస్తు సమర్పించడానికి ఈ పద్ధతి ఫాలో అవ్వండి.
    • ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి
    • అధికారిక వెబ్సైట్ లింక్ :: https://ecorbbs.in/
    • అధికారిక హోమ్ పేజీలోని Notification No. ECoR/Pers/RRC/ Act Apprentice/2026-27 లింక్ పై క్లిక్ చేయండి.
    • ఇప్పుడు మీరు ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి సూచనలు ఉన్నటువంటి పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
    • పేజీ ను పైకి జరిపి Click To Proceed Further లింక్ పై క్లిక్ చేయండి.
    • ఇప్పుడు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది
    • వ్యక్తిగత విద్యార్హత సంబంధిత వివరాలు నమోదు చేసి Click to Continue పై క్లిక్ చేయండి.
    • అర్హత ధ్రువపత్రాల కాపీలు, దరఖాస్తు ఫీజు చెల్లించి, విజయవంతంగా సబ్మిట్ చేయండి.


Spread the love

Leave a Comment