రాత పరీక్ష లేకుండా! ITI అర్హతతో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఉద్యోగ ప్రకటన అప్లై చేశారా?

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

ఐటిఐ అర్హతతో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..

రాత పరీక్ష లేకుండా! ఐటిఐ అర్హతతో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి, అప్రెంటిస్ యాక్టర్ 1961 ప్రకారం నియామకాలు నిర్వహించడానికి విద్యా సంవత్సరం 2025-2026 కోసం విశాఖపట్నం పోర్ట్ అథారిటీలోని మెకానికల్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విభాగాల్లో నిర్దేశిత వృత్తులలో ఒక సంవత్సరం శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక, జాతీయ అప్రెంటిస్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఈ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అప్రెంటిస్ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎంపికలు? మొదలగు సందేహాలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో..

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థVisakhapatnam Port Authority AP
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు20
విద్యార్హతలుసంబంధిత ITI ట్రేడ్ ఉత్తీర్ణత
వేతనంరూ.9,387.67-8,344.60
దరఖాస్తు ప్రారంభం తేదీ24.08.2026
దరఖాస్తు చివరి తేదీ23.09.2026
అధికారిక వెబ్సైట్https://vpt.shipping.gov.in/
పోస్టుల వివరాలు:
  1. వెల్డర్
  2. ఎలక్ట్రీషియన్
  3. మోటర్ మెకానిక్ (మోటార్ వెహికల్)
  4. ఎలక్ట్రానిక్స్ మెకానిక్
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత ట్రేడ్ లో ITI ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • తేదీ 31.08.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 14 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఉండాలి.
ఎంపికలు:
  1. On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన నిర్దిష్ట అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
వేతన వివరాలు:
  • ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం స్కాలర్షిప్ రూపంలో శిక్షణ పూర్తయ్యేంతవరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: దరఖాస్తు సమర్పించడానికి దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.apprenticeshipindia.gov.in/ ను సందర్శించండి.
  • ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు, అప్రెంటిస్ అవకాశాలను వెతకడానికి, Search Opportunity ఆప్షన్ దగ్గర (Trade), Select Course Type దగ్గర Designated, Select Location దగ్గర Andhra Pradesh, Search Establishment దగ్గర Visakhapatnam Port Authority నమోదు Apply బటన్ పై క్లిక్ చేసే అప్లై చేయండి.
దరఖాస్తు ఫీజు: లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

సందేహాలను నివృతి కోసం 08912873262 సంప్రదించండి.


Spread the love

Leave a Comment