TG Dept of AYUSH Recruitment 2026 – Apply Now

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఆయుష్ విభాగం – జాతీయ ఆయుష్ మిషన్ – వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మొత్తము వంద మార్కులకు గాను అకాడమిక్ అర్హతల్లో కనబరిచిన ప్రతిభకు 90% మార్కులు అలాగే వయో పరిమితికి 10% మార్కులు వెయిటేజ్ కల్పిస్తూ జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానం పలికింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుండే ప్రారంభమైనది అభ్యర్థులు 22.10.2026 నాటికి దరఖాస్తులు సమర్పించుకోవచ్చు దరఖాస్తు చిరునామా, పోస్టుల వివరాలు, నోటిఫికేషన్, అన్ని ఈ పేజీ చివరిలో ఇవ్వబడినవి. 8వ తరగతి నుండి డిగ్రీ పీజీ చేసిన వారికి పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థTG Dist Collector Office Medchal Malkajgiri District
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు08
విద్యార్హతలుVII, Relevant Diploma, Degree
వేతనంరూ.15,000-40,000
దరఖాస్తు ప్రారంభం తేదీ12.10.2026
దరఖాస్తు చివరి తేదీ22.10.2026
అధికారిక వెబ్సైట్https://medchal-malkajgiri.telangana.gov.in/
పోస్టుల వివరాలు:
  1. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ – 03
  2. ఫార్మసిస్ట్ – 01
  3. సైకలాజికల్ కౌన్సిలర్ – 01
  4. యోగ ప్రొఫెషనల్ – 01
  5. మల్టీ పర్పస్ వర్కర్ – 02
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 7వ తరగతి, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మా డి, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సంబంధిత విభాగంలో యోగా సర్టిఫికెట్, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, న్యూరోపతి విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • తేదీ: 01.07.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 44 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • ఎస్సీలు ఎస్టీలు మరియు బీసీలకు 5 సంవత్సరాలు,
  • మమాజీ సైనికులకు 3 సంవత్సరాలు,
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు,
  • వయో పరిమితులో సడలింపు ఉండి గమనించండి.
ఎంపికలు:
  1. Off-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను “ఉద్యోగ ప్రకటన అర్హతల ప్రకారం” అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపికలు చేస్తారు.
  2. ప్రకటనలో తెలుపబడిన జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం:
  • మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా పోస్టింగ్ ఉంటుంది.
వేతన వివరాలు:
  • ఆయుష్ డిపార్ట్మెంట్ – నేషనల్ ఆయుష్ మిషన్ లోని పోస్టులకు ఎంపికైన వారికి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
    • ఆయుష్ మెడికల్ ఆఫీసర్ రూ.40,000
    • ఫార్మసిస్ట్ రూ.20,000
    • సైకలాజికల్ కౌన్సిలర్ రూ.500 ప్రతి సెషన్ కి, సంవత్సరానికి కనీసం 200 విజిట్లు (ఆన్ కాల్)
    • యోగ ప్రొఫెషనల్ రూ.28,000
    • మల్టీ పర్పస్ వర్కర్ రూ.15,000
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: దరఖాస్తు ఫారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  • సంబంధి వెబ్ పేజీ లోని దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 22.10.2026 సాయంత్రం 05:00 గంటల లోగా సంబంధిత సెక్షన్లో అందించాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఈ AYUSH విభాగంలో అవుట్సోర్సింగ్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.


Spread the love

Leave a Comment