గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల. తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారు అప్లై చేసుకోండి. APCOB Notification 2026

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

గ్రామీణ కొ-ఆపరేటివే బ్యాంకుల్లో కాంట్రాక్ట్/ రెగ్యులర్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్..

డిగ్రీ అర్హతతో తెలుగులో చక్కగా మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చిన వారికి విజయవాడలోని, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB), శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! APCOB కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CTI) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ/ రెగ్యులర్ ఫ్యాక్టరీ/ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (CBDO) పోస్టుల భర్తీకి, ప్రాథమిక పరిశీలన, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు నియామకాలు చేపట్టడానికి వరుసగా 3 ప్రకటనలు విడుదల చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులు ఈ పోస్టుల కోసం, పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా, దరఖాస్తుఫీజు రూ.1,000/- డిడి రూపంలో చెల్లించి, సంబంధిత కాపీ మరియు దరఖాస్తు ఫామ్ సమర్పించుకోవాలి. దరఖాస్తు చిరునామా, దరఖాస్తు ఫీజు చెల్లించడానికి సంబంధించిన వివరాలు, ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినాయి గమనించండి. రూ.70,000/- జీతం ఉంటుంది తప్పక దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థAPCOB
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు05
విద్యార్హతలుసంబంధిత విభాగంలో డిగ్రీ
వేతనంరూ.70,000 + 5, 000రవాణా భత్యం
దరఖాస్తు ప్రారంభం తేదీ27.09.2026
దరఖాస్తు చివరి తేదీ13.10.2026
అధికారిక వెబ్సైట్https://apcob.bank.in/
సూచన: వరుసగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేశారు, నోటిఫికేషన్లు మరియు దరఖాస్తు ఫామ్ లింకులు క్రింద ఇవ్వబడినవి.
పోస్టుల వివరాలు:
  1. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ – 02,
  2. రెగ్యులర్ ఫ్యాకల్టీ – 02,
  3. కాంట్రాక్ట్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ – 01.
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ లో CAIIB/ కార్పొరేట్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో డిప్లొమా/ కామర్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్/ MBA/ అగ్రికల్చర్ లేదా సంబంధిత విభాగంలో PG అర్హత కలిగి ఉండాలి.
  2. టీచింగ్ విభాగంలో అనుభవంతో కంప్యూటర్/ మల్టీమీడియా స్కిల్ తెలిసి ఉండాలి.
  3. అనుభవం ఉన్న అభ్యర్థులకు 1st Chance ఉంటుంది.
  4. అనుభవం కలిగిన వారు, సంభందిత సర్టిఫికెట్ నకలు కాపీ దరఖాస్తు తో జత చేయండి.
వయోపరిమితి వివరాలు:
  • తేదీ 13.10.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 – 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపికలు:
  1. Off-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన Academic/ Technical అర్హతల ఆధారంగా వచ్చిన అప్లికేషన్లను ప్రాథమిక పరిశీలన చేసి, సర్టిఫికేట్ వెరీఫికేషన్ అనతరం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
  2. APCOB సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000 + 5000 రవాణా భత్యం కలిపి ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల నకలు కాపీలు జతచేసి, 13.10.2026 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా స్వయంగా లేదా రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా:
  • చీఫ్ జనరల్ మేనేజర్ (HRMD) గారికి, ది ఎ.పి. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్.టి.ఆర్. సహకార భవన్, డోర్ నం. 27-29-28, గవర్నర్‌పేట, విజయవాడ – 520002. 13.10.2026 నాటికి చేరే విధంగా పంపించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1,000/-.
  • DD రూపంలో సమర్పించాలి.
Download NotificationDownload Application form
Contract Faculty NotificationApplication form
Regular Faculty NotificationApplication form
Chief Business Development Officer (CBDO)Application form


Spread the love

Leave a Comment