రామగుండం ఎరువుల సంస్థ ఉద్యోగాలు విడుదల RCFL 40 Vacancies Notification

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

ఎరువుల తయారీ సంస్థ 40 పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..

తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, రామగుండం లోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (RCFL) అనేది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), మరియు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) సంస్థలచే ఏర్పాటు చేయబడిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన Advertisement No: Rectt/01/2026 తేదీ:26.08.2026 విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ లోని రామగుండం ప్లాంట్లో మరియు కార్పొరేట్ ఆఫీస్ నోయిడాలో పోస్టింగ్ ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, On-Line దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్? మొదలగు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ పేజీ ను పూర్తిగా చదవండి..

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థRamagundam Fertilizers and Chemicals Limited (RCFL)
ఉద్యోగస్థితితాత్కాలికం
మొత్తం పోస్టులు40
విద్యార్హతలుB.E/ B/Tech/ B.Sc (Engg.)
వేతనంరూ.40,000-2,40,000
దరఖాస్తు ప్రారంభం తేదీ26.08.2026
దరఖాస్తు చివరి తేదీ24.09.2026
అధికారిక వెబ్సైట్https://rfcl.co.in/
పోస్టింగ్ విభాగాలు:
  1. రసాయన
  2. మెకానికల్
  3. ఎలక్ట్రికల్
  4. మెటీరియల్స్
  5. రవాణా
  6. మానవ వనరులు
  7. వైద్య
  8. ఫైనాన్స్ & అకౌంట్స్
  9. సమాచార సాంకేతిక రంగాలు.
పోస్టుల వివరాలు:
  1. ఇంజనీర్(E-1) – 19
  2. అసిస్టెంట్ మేనేజర్(E-2) – 07
  3. డిప్యూటీ మేనేజర్(E-3) – 02
  4. ఆఫీసర్(E-1) – 05
  5. ఆఫీసర్ సెక్రటేరియల్(E-1) – 01
  6. అదనపు CMO (E-4) – 01
  7. CMO (E-4) – 01
  8. అకౌంట్స్ ఆఫీసర్(E-1) – 03
  9. చీఫ్ మేనేజర్(E-6) – 01
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో B.E, B.Tech, B.Sc/ CA/ MCA/ MBA/ MBBS/ MD/ MS అర్హత కలిగి ఉండాలి.
  2. విలవెంట్ ఫీల్డ్ లో అనుభవం అవసరం.
  3. అనుభవం ఉన్న అభ్యర్థులకు 1st ప్రిపరేషన్ ఉంటుంది.
  4. సంబంధిత సర్టిఫికెట్ దరఖాస్తుతో జత చేయండి.
వయోపరిమితి వివరాలు:
  • తేదీ 31.07.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తిచేసుకుని 50 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంది.
  • వివరాలు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపికలు:
  1. On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. RCFL సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. E -1 గ్రేడ్ రూ.40,000-1,40,000
  2. E -2 గ్రేడ్ రూ.50,000-1,60,000
  3. E -3 గ్రేడ్ రూ.60,000-1,80,000
  4. E -4 గ్రేడ్ రూ.70,000-2,00,000
  5. E -5 గ్రేడ్ రూ.80,000-2,20,000
  6. E -6 గ్రేడ్ రూ.90,000-2,40,000
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • GEN/ OBC/ EWS అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఉంటుంది.
    • E-5 & Above గ్రేడ్ పోస్టులకు రూ.1000/-
    • E-1 to E-4 గ్రేడ్ పోస్టులకు రూ .700/-
  • CS/ ST/ PwBD/ ExSM & Departmental అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

On-Line దరఖాస్తు కోసం :: క్లిక్ చేయండి.

On-Line దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి.

  1. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://rfcl.co.in/index.php
  3. అధికా Home పేజీలోని Main Menu లో కనిపిస్తున్న Careers లింక్ పై క్లిక్ చేయండి.
  4. Career పేజీ ఓపెన్ అవుతుంది.
  5. నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న View బటన్ పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ చదవండి.
  6. దరఖాస్తు సమర్పించడానికి Career పేజీలోని How To Apply బటన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి సూచనలను చదవండి.
  7. ఆ తదుపరి Login బటన్ పై క్లిక్ చేసి Click here for New Registration బటన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి.
  8. చివరిగా Login పై క్లిక్ చేసి, Email ID & Password ఆధారంగా Login అయి దరఖాస్తు విజయవంతంగా సమర్పించండి.

Spread the love

Leave a Comment