ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
సూపర్వైజర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CONCOR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ మరియు సూపర్వైజర్ కేడర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (Employement Notification No. 05/2026) విడుదల చేసింది. సంబంధిత కోర్సుల్లో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ 31.08.2026, 10:00 AM నుండి ప్రారంభమవుతుంది. 30.092026, 11:55 PM దరఖాస్తు గడువు. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, On-Line దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు, Step by Step దరఖాస్తు సమర్పించు విధానం, మొదలగు పూర్తి సమాచారం ఆర్టికల్ పూర్తిగా చదివితే తెలుసుకుంటారు..

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | Container Corporation of India Limited (CONCOR) |
| ఉద్యోగస్థితి | శాశ్వత |
| మొత్తం పోస్టులు | 77 |
| విద్యార్హతలు | B.E, B.Tech, B.Sc & Diploma |
| వేతనం | రూ.40,000-1,60,000 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 31.08.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 30.09.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://www.concorindia.co.in/ |

పోస్టుల వివరాలు:
- మేనేజ్మెంట్ ట్రైనీ (C&O) – 25,
- మేనేజ్మెంట్ ట్రైనీ (Accouns) -09,
- మేనేజ్మెంట్ ట్రైనీ (Accounts / Compliance)
- మేనేజ్మెంట్ ట్రైనీ (Technical) – 04,
- మేనేజ్మెంట్ ట్రైనీ (MIS) – 03,
- మేనేజ్మెంట్ ట్రైనీ (Civil) – 02,
- మేనేజ్మెంట్ ట్రైనీ (P&A) – 02,
- అసిస్టెంట్ ఆఫీసర్ (C&O) – 20,
- అసిస్టెంట్ ఆఫీసర్ (Accounts) – 02,
- అసిస్టెంట్ ఆఫీసర్ (Technical) – 04,
- అసిస్టెంట్ ఆఫీసర్ (MIS) – 02,
- అసిస్టెంట్ ఆఫీసర్ (Civil) – 04.
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగంలో B.E/ B.Tech/ B.Sc డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 32 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- మేనేజ్మెంట్ ట్రైనీ లకు 18 – 28,
- అసిస్టెంట్ ఆఫీసర్ లకు 18 – 32.
ఎంపికలు:
- On-Line కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష,
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- మేనేజ్మెంట్ ట్రైనీ లకు రూ.50,000-1,60,000
- అసిస్టెంట్ ఆఫీసర్ లకు రూ.40,000-1,36,000
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 31.08.2026 ముగింపు 30.09.2026.
దరఖాస్తు ఫీజు :
- GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.1000/-,
- CS/ ST/ PwBD/ Ex-servicemen/ Women అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
On-Line లో దరఖాస్తు సమర్పించడానికి :: క్లిక్ చేయండి.
On-Line లో దరఖాస్తు సమర్పించడానికి ఈ దశలను అనుసరించండి.
- ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.concorindia.co.in/
- అధికారిక Home పేజీలోని Main Menu పై క్లిక్ చేసి కనిపిస్తున్న HR & Career లింక్ పై క్లిక్ చేసి Recruitment And Results పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf & Online Apply లింక్ ఉన్నటువంటి పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
- Online Apply లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు సమర్పించండి.
Visakhapatnam