ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్..
భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, చత్తీస్ ఘడ్ లోని, సైనిక్ స్కూల్ అంబికాపూర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ప్రకటన విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆశావహులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది, దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి కాబట్టి వెంటనే వివరాలు తెలుసుకొని అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి, అలాగే సంబంధిత అర్హత కాపీలు జత చేసి, దరఖాస్తు ఫీజు డిడి రూపంలో సైనిక్ స్కూల్ అంబికాపూర్ పేరు మీదుగా చెల్లించి దానిని కూడా దరఖాస్తుతో జత చేసి పోస్ట్ చేయండి. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, సెలక్షన్ విధానం ఎలా? మొదలగు సమాచారం ఈ ఆర్టికల్ లో పొందుపరచడం జరిగింది.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | Sainik School Ambikapur |
| ఉద్యోగస్థితి | రెగ్యులర్/కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టులు | 07 |
| విద్యార్హతలు | Inter, Degree, Diploma తో B.Ed, B.P.Ed |
| వేతనం | రూ.28,800-71,8400 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 21.08.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 11.09.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://www.sainikschoolambikapur.org.in/ |
పోస్టుల వివరాలు:
- లాబరేటరీ అసిస్టెంట్ (బయాలజీ) – 01,
- PE/MATH cum Matron (మహిళలు మాత్రమే) – 01,
- బ్యాండ్ మాస్టర్/ మ్యూజిక్ టీచర్ – 01,
- వార్డ్ బాయ్ (జనరల్ సర్వీస్) – 04.
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా తో B.Ed/ B.P.Ed అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే మంచిది.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు అత్యుత్తమ ప్రాధాన్యత ఉంటుంది.
- ఆయా రంగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థులు, సర్టిఫికెట్ నకలు కాపీ దరఖాస్తు ఫామ్ తో జత చేయండి.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తిచేసుకుని 55 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- గవర్నమెంట్ రూల్ ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపు ఉంటుంది.
- వివరాలకు నియామక ప్రకటన చదవండి
ఎంపికలు:
- Off-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- సైనిక్ స్కూల్ నియామక కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
- ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) నిబంధన ప్రకారం రూ.28,800/- నుండి 71,8400/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
- 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 11.09.2026 సాయంత్రం 05:00 గంటల వరకు చేరే విధంగా పోస్ట్ చేయాలి.
- పోస్టల్ ఆలస్యం వల్ల గడువు సమయం లోపు అందని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
దరఖాస్తు ఫీజు:
- దరఖాస్తు ఫీజు RTGS/ NEFT/ Digital రూపాల్లో సమర్పించాలి.
- రెగ్యులర్ పోస్టులకు రూ.500/-,
- కాంట్రాక్ట్ పోస్టులకు రూ.300/-.
అకౌంట్ వివరాలు:

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
చిరునామా:
- Sainik School Ambikapur, Mendra Kalan, Dist – Surguja – 497001.