రైల్వేలో ఉద్యోగాలు విడుదల సెప్టెంబర్ 08 & 09 తేదీల్లో ఇంటర్వ్యూలు IRCTC Tourism Monitor Notification

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

టూరిజం మోనిటర్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్..

భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని, “నవరత్న” లిస్టెడ్ కంపెనీ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వేల యొక్క వృత్తిపరమైన ఆతిధ్య మరియు ప్రయాణ విభాగం, రైల్వేలలో క్యాటరింగ్ సేవలను అభివృద్ధి చేయడానికి అలాగే దేశంలో రైలు ఆధారిత దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడినది. తాజాగా ఐ ఆర్ సి టి సి నార్త్ జోన్ నుండి టూరిజం మానిటర్ విభాగంలో మొత్తం 9 పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయబడినది. రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఈ నియామకాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ No. 2026/IRCTC/NZ/HRD/Contractual/Tourism Monitor తేదీ: 07.08.2026 న విడుదల అయినది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు ఫామ్, ఇంటర్వ్యూ షెడ్యూల్, ముఖ్య తేదీలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? మొదలగు పూర్తి ముఖ్య సమాచారం కోసం ఈ ఆర్టికల్లో…

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థIRCTC NZ
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు09
విద్యార్హతలుBachelor Degree in Tourism
వేతనంరూ.30,000-35,000
దరఖాస్తు ప్రారంభం తేదీ07.08.2026
దరఖాస్తు చివరి తేదీ09.09.2026
అధికారిక వెబ్సైట్https://www.irctc.com/index.php
పోస్టుల వివరాలు:
  1. కార్పొరేట్ ఆఫీస్ – 06,
  2. పోస్ట్ ఆఫీస్ నార్త్ జోన్ – 03.
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి టూరిజం విభాగంలో మూడు(3) సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. (లేదా)
  2. ఏదైనా విభాగంలో మూడు,(3) సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో ఒక(1) సంవత్సరం ట్రావెల్ మరియు టూరిజం విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  3. సంబంధి విభాగంలో అనుభవం అవసరం.
  4. అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
  5. అనుభవం సర్టిఫికేట్ ఉంటే జిరాక్స్ కాపీ అప్లికేషన్ ఫామ్ కు జత చేయండి..
  6. ఇంటర్వ్యూ సమయంలో చూపించండి.
వయోపరిమితి వివరాలు:
  • తేదీ 01.09.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
  • భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంది.
  • వయోపరిమితులో సడలింపులు కావాలనుకునే అభ్యర్థులు, నోటిఫికేషన్ చదవండి.
ఎంపికలు:
  1. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  2. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ షెడ్యూల్ తెలుసుకొని ఆ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
  3. IRCTC సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.30,000/- నుండి రూ.35,000/- వేల వరకు చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
  • ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
  • 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 08 & 09 సెప్టెంబర్ 2026 ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇంటర్వ్యూ (వేదిక, తేదీ & సమయం) షెడ్యూల్ :

ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:

  1. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ కు రావాలి.
  2. ఒరిజినల్ సర్టిఫికెట్ లేని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు అనుమతించరు.
  3. 10వ తరగతి మార్క్ మెమో సర్టిఫికెట్,
  4. ఇంటర్మీడియట్ మార్క్ మెమో సర్టిఫికెట్,
  5. గ్రాడ్యుయేషన్ మార్క్ మెమో సర్టిఫికెట్,
  6. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ మెమో సర్టిఫికెట్,
  7. అన్ని రకాల అనుభవం సర్టిఫికెట్లు,
  8. కుల ధ్రువీకరణ పత్రం,
  9. దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్,
  10. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ,
  11. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్,
  12. సంబంధి అన్ని రకాల సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.


Spread the love

Leave a Comment