ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) హౌస్ కీపింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన టాటా మెడికల్ సెంటర్, విశాఖపట్నం. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (హౌస్ కీపింగ్) విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను సెప్టెంబర్ 25న జరుగునున్న ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల యువత ఈ పోస్టుల కోసం నేరుగా తమ సర్టిఫికెట్లను జతచేసుకొని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; ఉద్యోగ ప్రకటన, ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఫామ్, అఫీషియల్ వెబ్సైట్ లింక్, మొదలైనవి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి..

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | TMC, Homi Bhabha Cancer Hospital & Research Centre, Visakhapatnam |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టులు | 07 |
| విద్యార్హతలు | SSC |
| వేతనం | రూ.18,020/- |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 17.09.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 25.09.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://tmc.gov.in/ |
పోస్టుల వివరాలు:
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (హౌస్ కీపింగ్) – 07.
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC తో ఒక సంవత్సరం అనుభవం అర్హత గా కలిగి ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం కలిగిన అభ్యర్థులు, సంబంధిత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ దరఖాస్తు ఫామ్ తో జత చేయండి.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi Visakhapatnam సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీ:
- వేదిక: Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi Visakhapatnam.
- సమయం: ఉదయం 09:30 నుండి 10:30 వరకు.
- తేదీ: 25.09.2026,
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,020/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- 📌 సూచన :: నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగి ఆసక్తి కలిగిన వారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వడానికి తమ బయోడేటా ఫామ్ పూర్తి చేసుకుని సంబంధిత అన్ని నకలు జిరాక్స్ కాపీలు జత చేసుకుని హాజరవ్వాలి.
దరఖాస్తు ఫీజు:
- ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (హౌస్ కీపింగ్) పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: ఇక్కడ క్లిక్ చేయండి.