📢 Good News! విద్యా వాలంటీర్ల భర్తీకి ప్రకటన, జిల్లాల వారీగా ఖాళీలు ఇక్కడ AP Academic Instructors Notification Hurry Up!

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన, జిల్లాల వారీగా ఖాళీలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్..

విద్యా సంవత్సరం 2026-27 కు గాను రాష్ట్రవ్యాప్తంగా, ప్రభుత్వ, జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, మునిసిపాలిటీ మరియు మునిసిపాలిటీ కార్పొరేషన్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి Academic Instructors (విద్యా వాలంటీర్లు) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ, డైరెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా Rc.No.ESE02/13024/7/2025/EST3-CSE, తేదీ: 13.08.2026 న రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, జిల్లాల వారీగా విద్యా వాలంటీర్ల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి నియామకాలు నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత జిల్లా మరియు మండల విద్యాశాఖ అధికారులు ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లా పాఠశాలల పరిధిలోని పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను 16.08.2026 ఉదయం 10:00 గంటల నుండి 21.08.2026 సాయంత్రం 05:00 గంటల లోపు దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్వపాత్రాల కాపీలను జత చేసి సమర్పించుకోవాలి. 8 నెలల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకాలు నిర్వహించి కొనసాగించడానికి రూ.58,14,60,000/- సమగ్ర శిక్ష కు బడ్జెట్ కేటాయించింది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంపిక విధానం ఏమిటి? మొదలగు పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థSchool Education Dept AP
ఉద్యోగస్థితికాంట్రాక్ట్
మొత్తం పోస్టులు6534
విద్యార్హతలుInter, Degree, Diploma తో B.Ed
వేతనంరూ.10,000-12,500
దరఖాస్తు ప్రారంభం తేదీ16.08.2026
దరఖాస్తు చివరి తేదీ21.08.2026
అధికారిక వెబ్సైట్https://cse.ap.gov.in/
పోస్టుల వివరాలు:
  1. స్కూల్ అసిస్టెంట్ (SA) – 2937,
  2. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) – 3597.
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా తో B.Ed (బ్యాచిలర్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలి.
  2. TET/ CTET అర్హత అవసరం.
  3. సంబంధిత సబ్జెక్టు బోధించడంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
  4. అనుభవం కలిగిన అభ్యర్థులు, ఆ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ దరఖాస్తు ఫామ్ తో జత చేయండి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 45 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
  1. ఆఫ్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. స్కూల్ అసిస్టెంట్ (SA) లకు రూ.12,500/-,
  2. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) లకు రూ.10,000/-
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, 21.08.2026 సాయంత్రం 05:00 గంటల లోగా మీ మండల విద్యాశాఖ అధికారి గారికి సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఈ విద్యా వాలంటీర్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.


Spread the love

Leave a Comment