ఐటిఐ, డిగ్రీ, డిప్లోమాతో 1346 పోస్టుల భర్తీకి ప్రకటన BEML Notification 2026 Apply 1346 Vacancies Hurry Up!

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

రాత పరీక్ష లేకుండా 1346 పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన BEML లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1346 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Advt. No.L&D/01/2026 తేదీ: 18.08.2026) జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఆప్రెంటిస్ శిక్షణలు పొందడానికి దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో 18.08.2026 నుండి 08.09.2026 మధ్య సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను పరిశీలన చేసి, మెరిట్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో సెలక్షన్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు శిక్షణలు ఇస్తారు శిక్షణ కాలంలో వారికి గౌరవ వేతనం అందించడం జరుగుతుంది. ఈ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ ఉంటుంది.ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక ప్రకటన, దరఖాస్తు ఫామ్ Pdf, ఎలా దరఖాస్తు చేయాలి? ఎంపికలు ఎలా చేస్తారు? మొదలగు పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో పొందుపరచడం జరిగింది. చదివి తెలుసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థBEML Limited
ఉద్యోగస్థితిశిక్షణ
మొత్తం పోస్టులు1346
విద్యార్హతలుITI, Degree, B.E., B.Tech, Diploma
వేతనంరూ.10,560-12,300
దరఖాస్తు ప్రారంభం తేదీ18.08.2026
దరఖాస్తు చివరి తేదీ08.09.2026
అధికారిక వెబ్సైట్https://www.bemlindia.in/careers/
శిక్షణ విభాగాలు:
  1. గ్రాడ్యుయేట్ టెక్నికల్
  2. గ్రాడ్యుయేట్ జనరల్
  3. డిప్లొమా
  4. ఐటిఐ
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి అప్రెంటిస్ శిక్షణ ఖాళీలను అనుసరించి ITI, Degree, B.E., B.Tech, Diploma అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఉండాలి.
ఎంపికలు:
  1. On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు.
  2. షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
  3. రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ద్వారా ఈ సమాచారాన్ని తెలియపరుస్తారు.
  4. అభ్యర్థులు యాక్టివ్ ఈమెయిల్ ఐడి తో దరఖాస్తు సమర్పించండి.
  5. తరచూ ఈమెయిల్ అప్డేట్స్ తనిఖీ చేస్తూ ఉండండి.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం శిక్షణ కోర్సుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. గ్రాడ్యుయేట్ టెక్నికల్ రూ.12,300/-,
  2. గ్రాడ్యుయేట్స్ జనరల్ రూ.12,300/-,
  3. డిప్లొమా రూ.10,900/-,
  4. ఐటిఐ రూ.9,600/- లేదా 10,560/-.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
  • ఐటిఐ అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/
  • డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థులు https://nats.education.gov.in/ ముందుగా రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి.
  • తదుపరి అధికారిక BEML వెబ్సైట్ ను https://recruitment.bemlindia.in/Apprentice/VacancyNotice.aspx సందర్శించి దరఖాస్తు సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఈ అప్రెంటిస్ శిక్షణలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

సందేహాలు? సమాధానాలు.

  • ఈ అప్రెంటిస్ శిక్షణలు పూర్తి చేయడం అవసరమా?
    • అవును, అవసరమే. ఈ అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో రాబోయే ఉద్యోగ అవకాశాలలో, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • శిక్షణ కాలం వేరు వేరు అప్రెంటిస్ శిక్షణలకు వేరువేరుగా ఉంటుందా?
    • అవును, టెక్నికల్/ జనరల్/ డిప్లమా & ఐటిఐ విభాగాలకు ఆఫర్ చేస్తున్నటువంటి సంస్థ నిబంధనల ప్రకారం కనిష్టంగా ఒక (1) సంవత్సరం నుండి గరిష్టంగా మూడు (3) సంవత్సరాల వరకు ఉంటుంది.
  • శిక్షణ కాలంలో గౌరవ వేతనం చెల్లిస్తారా?
    • అవును, చెల్లిస్తారు. శిక్షణ కాలంలో ప్రతినెల కోర్సుల ఆధారంగా రూ.9,600/- నుండి రూ.12,300/- వరకు చెల్లిస్తారు.
అభ్యర్థులకు సూచన:

నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటిషిప్ శిక్షణల కోసం సంబంధిత కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు, తప్పక దరఖాస్తు చేసుకోండి. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్ర ప్రభుత్వ (బ్యాంకింగ్/ రైల్వే/ టెలికం) సంస్థల నుండి ఉద్యోగ ప్రకటనలు అప్రెంటిస్ అర్హతలు కలిగిన అభ్యర్థుల కోసం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఉంటుంది గమనించండి.


Spread the love

Leave a Comment