📢 Great News! Govt Regular JOBs: టెన్త్ పాస్ తో ప్రభుత్వ శాశ్వత రిసెప్షనిస్ట్, డ్రైవర్, సెక్యూరిటీ ఉద్యోగాలు

Spread the love

ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!

రిసెప్షనిస్ట్, డ్రైవర్, సెక్యూరిటీ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..

భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (CSIO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advertisement No. Regular – 01/2026) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను 14.08.2026 నుండి 14.09.2026 మధ్య సమర్పించుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ పరీక్ష, ప్రొఫిషియన్సీ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికలు ఉంటాయి. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు, ఎలా అప్లై చేయాలి? అని మీ సందేహాలకు సమాధానాల కోసం ఈ ఆర్టికల్ చదివితే తెలుస్తాయి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థCSIR CSIO
ఉద్యోగస్థితిశాశ్వత
మొత్తం పోస్టులు06
విద్యార్హతలు10th, Inter, Degree
వేతనంరూ.19,900-1,12,400
దరఖాస్తు ప్రారంభం తేదీ14.08.2026 @ 10:00 AM
దరఖాస్తు చివరి తేదీ14.09.2026 @ 05:00 PM
అధికారిక వెబ్సైట్https://www.csio.res.in/
పోస్టుల వివరాలు:
  1. సెక్యూరిటీ ఆఫీసర్ – 01,
  2. రిసెప్షనిస్ట్ – 01,
  3. డ్రైవర్ – 04.
కనీస విద్యార్హతలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th, Intermediate, Degree అర్హత కలిగి ఉండాలి.
  2. అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
  3. అనుభవం కలిగిన అభ్యర్థులు, ఆ సర్టిఫికెట్లను సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో చూపించండి.
వయోపరిమితి వివరాలు:
  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
ఎంపికలు:
  1. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రొఫెషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
  2. అభ్యర్థులు పోస్టులను అనుసరించి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

రాత పరీక్ష అంశాలు:

సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు..
  • రాత పరీక్షలో ఈ అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి. అవి;
  • పేపర్ -I లో..
    • మెంటల్ ఎబిలిటీ మరియు పర్సనాలిటీ అసెస్మెంట్ పరీక్షలో భాగంగా 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
    • నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అమలులో లేదు
  • పేపర్-II లో..
    • కాంప్రహెన్సెస్ నుండి 25 మార్కులకు,
    • రిపోర్ట్ రైటింగ్ నుండి 25 మార్పులకు,
    • సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ఫైర్ ఫైటింగ్ మొదలగు అంశాల నుండి 25 మార్కులకు,
    • జనరల్ అవేర్నెస్ నుండి 25 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
రిసెప్షనిస్ట్ పోస్టులకు..
  • పర్సనాలిటీ అసెస్మెంట్ పరీక్ష నిర్వహిస్తారు.
డ్రైవర్ పోస్టులకు..
  • ముందుగా డ్రైవింగ్ విభాగంలో స్కిల్ టెస్ట్ ఉంటుంది.
  • స్కిల్ టెస్ట్ లో ప్రతిభా కనబరిచిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • పాత పరీక్షలో ఈ అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
    • జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
    • క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్న 75 మార్కులకు
    • జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
    • ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు అడుగుతారు.
    • ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు ఇస్తారు.
  • నెగిటివ్ మార్కులు ఉన్నాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తాడు.
  • మొత్తం 100 ప్రశ్నలు పదో తరగతి ప్రామాణికంగా అడుగుతారు.
  • పరీక్ష సమయం 90 నిమిషాలు.
వేతన వివరాలు:
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా వేతన శ్రేణి 2, 4, & 6 ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
  1. సెక్యూరిటీ ఆఫీసర్ రూ.35,400-1,12,400/-,
  2. రిసెప్షనిస్ట్ రూ.25,500-81,100/-,
  3. డ్రైవర్ రూ.19,900-63,200/-.
అప్లికేషన్ ప్రాసెస్:
  • దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
  • 📌 సూచన :: On-Line దరఖాస్తు కోసం అభ్యర్థులు ఫోటో, సిగ్నేచర్ & సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు:
  • GEN/ OBC/ EWS వర్గాల అభ్యర్థులకు రూ.500/-,
  • SC/ ST/ PwDB/ ESM & Womenలకు దరఖాస్తు లేదు.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment