ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
ప్రభుత్వ శాశ్వత టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్..
భారత ప్రభుత్వ, సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ కొలువులు భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ADVERTISEMENT NO. R&A/01/2026 విడుదల చేసింది. ఈ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు 05.09.2025 ఉదయం 10:00 నుండి, 11.09.2026 సాయంత్రం 05:00 వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ తేదీలను గుర్తు పెట్టుకొని హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెక్నీషియన్ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్, ముఖ్య తేదీలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంపిక విధానం? మరియు రాత పరీక్ష సిలబస్ మొదలగు పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | CSIR |
| ఉద్యోగస్థితి | రెగ్యులర్ |
| మొత్తం పోస్టులు | 43 |
| విద్యార్హతలు | SSC/10th+ITI |
| వేతనం | రూ.19,900-63,200 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 18.08.2026 @ 10:00 AM |
| దరఖాస్తు చివరి తేదీ | 17.09.2026 @ 05:00 PM |
| అధికారిక వెబ్సైట్ | https://www.csir.res.in/en |
పోస్టుల వివరాలు:
- కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) – 21,
- డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ (DTPO) – 07,
- కంప్యూటర్ హార్డ్వేర్ & నెట్వర్క్ మెయింటెనెన్స్ (CH & NM) – 05,
- మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (MLT) – 02,
- Draughtsman ఆర్కిటెక్చర్ – 02,
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 02,
- Draughtsman మెకానికల్ – 01,
- Draughtsman సివిల్ – 01,
- లాబరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్ (LACP) – 01,
- ఇంటీరియర్ డిజైనర్ – 01.
📌 సూచన :: దివ్యాంగులకు మాజీ సైనికులకు కూడా పోస్టులు కేటాయించారు గమనించండి.
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి SSC/ 10th అర్హత తో సంబంధిత విభాగంలో ITI ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం కలిగిన అభ్యర్థులు, ఆ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ దరఖాస్తు ఫామ్ తో జత చేయండి.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 28 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపికలు:
- On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా స్క్రీనింగ్, స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసి, వారికి ట్రేడ్ పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిసియన్సీ పరీక్షకు అనుమతినిస్తారు.
- పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
- పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- పేపర్ 2 లో మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు వంద మార్కులకు అడుగుతారు.
- ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు.
- పేపర్ 2 లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి (25+25) 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది.
- రాంగ్ ఆన్సర్ కి ఒక మార్క్ కట్ చేస్తారు.
- పేపర్ 3 లో సంబంధిత సబ్జెక్టు నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది.
- రాంగ్ ఆన్సర్ కి ఒక మార్క్ కట్ చేస్తారు.
- ఇలా మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం రెండు గంటల 30 నిమిషాలు.
- పరీక్ష పేపర్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి 2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ కలిపి వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.500/-,
- CS/ ST/ PwBDs/ Ex-servicemen & Women అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.