ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింక్..
భారత ప్రభుత్వ, పోర్టులు, షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన, కర్ణాటక మాల్పె లోని ఉడిపి కోచింగ్ షేప్ లిమిటెడ్ (UCHL) కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL) అనుబంధంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ (కాంట్రాక్ట్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు భారతీయ అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. మొత్తం 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా; అధికారిక నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు, ఎలా అప్లై చేసుకోవాలి? ఎంపిక ఎలా చేస్తారు? మొదలగు పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | Cochin Shipyard Limited |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టులు | 13 |
| విద్యార్హతలు | Diploma in Engineering, Bachelor Degree, ITI |
| వేతనం | రూ.40,650-44,164 |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 11.08.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 01.09.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://cochinshipyard.in/welcome |
పోస్టుల వివరాలు:
- సూపర్వైజర్ మెకానికల్ – 10.
- సూపర్వైజర్ ఎలక్ట్రికల్ – 02,
- సూపర్వైజర్ ఫైనాన్స్ – 01.
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి (మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధి విభాగంలో అనుభవం కలిగి ఉండాలి
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
- అనుభవం కలిగిన అభ్యర్థులు, ఆ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ దరఖాస్తు ఫామ్ తో జత చేయండి.
వయోపరిమితి వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 45 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
- గరిష్ట వయో పరిమితి 50 సంవత్సరాలు.
ఎంపికలు:
- రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.
- Phase -I & Phase -II పరీక్షల ద్వారా నిర్వహిస్తారు
- Phase -I లో రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో 40 మార్కులకు, అలాగే డిస్క్రిప్టివ్ పరీక్ష 40 మార్కులకు నిర్వహిస్తారు.
- Phase -II లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు పని అనుభవానికి 20 మార్కులు.
- ఇలా మొత్తం 100 మార్కులకు ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్ష అంశాలు:
- జనరల్ నాలెడ్జ్ నుండి 5 ప్రశ్నలు 5 మార్కులకు,
- జనరల్ ఇంగ్లీష్ నుండి 5 ప్రశ్నలు 5 మార్కులకు,
- రీజనింగ్ నుండి 5 ప్రశ్నలు 5 మార్కులకు,
- సంబంధిత సబ్జెక్టు నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు
- ఇలా మొత్తం 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు.
- ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం పోస్టుల ఆధారంగా ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- 1వ సంవత్సరం రూ.40,650/-,
- 2వ సంవత్సరం రూ.41,490/-,
- 3వ సంవత్సరం రూ.42,355/-,
- 4వ సంవత్సరం రూ.43,246/-,
- 5వ సంవత్సరం రూ.44,164/-.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- GEN/ OBC/ EWS అభ్యర్థులకు రూ.300/-,
- CS/ ST/ PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
On-Line దరఖాస్తు చేసుకోవడం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://cochinshipyard.in/welcome
- అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
- Career పేజీ ఓపెన్ అవుతుంది.
- నోటిఫికేషన్ లిస్ట్ అందుబాటులో ఉంటుంది.
- సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ని ఎంపిక చేసుకోండి.
- ఇప్పుడు మీరు Vacancy Details పేజీలోకి రీ డైరెక్టు అవుతారు.
- ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి.
- తదుపరి దరఖాస్తు సబ్మిట్ చేయడానికి సంబంధించిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తును విజయవంతంగా సమర్పించండి.