ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2026-27 విద్యా సంవత్సరానికి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ మరియు జువాలజీ సబ్జెక్టులలో IIT-NEET కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. రాత పరీక్ష డెమో ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల (₹.1,00,000/-) లక్ష రూపాయల శాలరీ అందిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణ 12.10.2026 నుండి ప్రారంభించబడుతుంది రాత పరీక్ష 15.11.2026 న నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలే అయినప్పటికీ భారిస్తాయి వేతనం ఉన్నందున ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పక ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయండి. అలాగే రాత పరీక్ష, డెమో పరీక్ష లో నెగ్గి పోస్టులను మీ సొంతం చేసుకోండి.

ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | APSWREIS |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టులు | 27 |
| విద్యార్హతలు | సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ |
| వేతనం | రూ.1,00,000/- |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 12.10.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 26.10.2026 |
| అధికారిక వెబ్సైట్ | https://swreis.ap.gov.in/ |
పోస్టుల వివరాలు:
- మ్యాథమెటిక్స్ – 07
- ఫిజిక్స్ – 12
- కెమిస్ట్రీ – 03
- బోటనీ – 02
- జువాలజీ – 03
కనీస విద్యార్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి అర్హత కలిగి ఉండాలి.
- IITs, NITs, BITs, IISERs పై కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి వివరాలు:
- తేదీ 01.10.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 44 సంవత్సరాలకు మీచకుండా ఉండాలి.
- వయసు సడలింపు వివరాలు:
- SC/ ST/ BC/ EWS: 5 సంవత్సరాలు.
- దివ్యాంగులకు: 10 సంవత్సరాలు.
- మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు.
- వయసు సడలింపు వివరాలు:
ఎంపికలు:
- రాత పరీక్ష డెమో ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్ష: 80 మార్కులకు
- డెమో క్లాస్: 20 మార్కులకు
- పరీక్షా సమయం: 90 నిమిషాలు
- పరీక్ష పద్ధతి: Off-Line (OMR ఆధారిత నెగిటివ్ మార్కులతో)
- పపరీక్ష మాధ్యమం: ఇంగ్లీష్
- సిలబస్: IIT/ NEET ప్రామాణిక సిలబస్.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
- 📌 సూచన :: On-Line దరఖాస్తులను సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా APSWREIS వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని,
- రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా లాగిన్ అయి,
- దరఖాస్తు సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- అందరికీ రూ.200/-.
👉 సందేహాలను నివృత్తి కోసం 8978222529 సంప్రదించండి.
✅ హెల్ప్ డెస్క్ వాట్సాప్ నెంబర్: 8978222529.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.